Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ విద్యుత్ బకాయిలపై తెలంగాణ హైకోర్టులో టీఎస్‌ట్రాన్స్‌కో రిట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో సంస్థ నుంచి తమకు రూ.1730 కోట్ల బకాయిలు రావల్సి ఉన్నాయనీ, వాటిని చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ టీఎస్‌ట్రాన్స్‌కో తెలంగాణ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. బకాయిల అసలు సొమ్ము రూ.1,267 కోట్లు, వడ్డీ రూ. 463 కోట్లు...మొత్తం కలిపి చెల్లించేలా ఉత్తర్వులివ్వాలని టీఎస్ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సీ శ్రీనివాసరావు ఈ రిట్‌ను దాఖలు చేశారు. దీనిలో ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, ఏపీ ట్రాన్స్‌కో, పెన్షన్ అండ్ గ్రాట్యూటీ ఫండ్ ట్రస్టులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే తరహాలో బకాయిలు చెల్లించాలంటూ గతంలో వేసిన మరో కేసుతో కలిపి ఈ రిట్‌ను అక్టోబర్ 13న విచారణ చేస్తామని జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ శ్రీనివాసరావుల ధర్మాసనం తెలిపింది.