Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమోచనమా.. విలీనామాపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'తెలంగాణ విమోచనమో...విలీనమో గవర్నర్‌కు ఎందుకు? నీ ఉద్యోగం నువ్వు చేసుకోరాదా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి వ్యవస్థల్ని అప్రతిష్టపాలు చేయడం ఎందుకు?' అని గవర్నర్ తమిళసైని ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజాస్వామ్యానికి గవర్నర్ వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైనది... అంటూ అప్పటి ఎన్టీఆర్, ఇప్పటి జార్ఖండ్ ప్రభుత్వాల కూల్చివేతల వెనుక ఉన్న గవర్నర్ పాత్రల్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను విలీన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమైక్యతా దినం అనేది తప్పు అని స్పష్టం చేశారు. శనివారంనాడిక్కడి సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, విలీన దినోత్సవాల్లో ఎక్కడా ఆర్ఎస్ఎస్, బీజేపీకి స్థానం లేదన్నారు. ట్యాంక్‌బండ్‌పై రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలు ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. సాయుధ పోరాటానికి సెప్టెంబర్ 11న పిలుపు ఇచ్చారనీ, ఆదివారం ట్యాంక్‌బండ్‌పైనున్న మగ్దూం మొయినుద్దీన్ విగ్రహం వద్ద విలీన ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయుధ పోరాటంలో మరణించిన అమరుల పేర్లతో అధికారిక డాక్యు మెంట్ విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, నగర కార్యదర్శి ఈటీ నర్సింహా, మేడ్చల్, వికారాబాద్, సూర్యాపేట జిల్లా కార్య దర్శులు సాయిలు గౌడ్, విజయలక్ష్మి పండిట్, వెంకటేశ్వరరావు పాల్గొ న్నారు. అంతకుముందు వారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి, నివాళులు అర్పించారు.