Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరీశ్‌రావుకు ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ కు సంబంధించిన ఉత్తర్వులు త్వరగా వచ్చేలా కృషి చేయాలని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యా రోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావును శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ఆర్థిక శాఖ అనుమతి లభించడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదనీ, మంత్రి కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, నాయకులు గోవర్ధన్, పరుశురాం, రామచంద్రారెడ్డి, శ్రీపతి సురేష్‌బాబు, శ్రీనివాసరావుతోపాటు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.