Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి. నర్సింహారావు
- ఐలమ్మ 37 వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
నవ తెలంగాణ - విలేకరులు
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిప్పు రవ్వ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు అన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన ఆ పోరాటంలో దున్నే వాడికే భూమి కావాలని ఆమె నినదించారని, పోరాడారని తెలిపారు. శనివారం ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సభలు నిర్వహించారు. ఆమె చిత్రపటాలకు పూలమాలలేసి నివాళి అర్పించారు. హైదరాబాద్‌లోని బాలానగర్ మండల కేంద్రంలో ఐలమ్మ వర్ధంతి సభలో డిజి.నర్సింహారావు మాట్లాడారు. నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. తెలంగాణ నైజాం సంస్థానంలో భూ పోరాటాలకు ఐలమ్మ పోరాటం ఊపునిచ్చిందన్నారు. పోరాటకాలంలో అజ్ఞాతంతో ఉన్న నాయకులకు అన్నాన్ని గంపల్లో తీసుకెళితే పోలీసులు పట్టుకుంటారని, బట్టల మూటల్లో తీసుకెళ్ళి కమ్యూనిస్టు సాయుధ దళాలకు అందించిన ధైర్యశాలి ఐలమ్మ అన్నారు.
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, హైదరాబాద్ సౌత్ కమిటీ కార్యదర్శి ఎం.డి.అబ్బాస్ అన్నారు. సంతోష్‌నగర్ సీపీఐ(ఎం) కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి, అమర వీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్, కృష్ణకాంత్ పార్క్ వద్ద గల వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని ఐలమ్మ విగ్రహానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు.