Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బొగ్గు గనుల వెలికితీత, వాటి కేటాయింపు, లీజుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందనీ, వాటిని అమలు చేసేటప్పుడు రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు కొనసాగిన రాష్ట్రాల గనుల శాఖల మంత్రుల సదస్సు శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన జోషి మాట్లాడుతూ... బొగ్గు రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంచేందుకు రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని తెలిపారు. 2014లో సుప్రీంకోర్టు బొగ్గు బ్లాకులను రద్దు చేసిన తర్వాత 2015లో వాటి కేటాయింపు ప్రారంభమైందన్నారు.