Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్‌కు చెందిన ప్రముఖ నర్తకి హిమాన్షి 'అంతర్ ఉన్మేష మనసి' అనే పేరుతో మరో సరికొత్త నృత్య ప్రదర్శనను ఆదివారం హైదరాబాద్‌లో రవీంద్రభారతిలో ఇవ్వనుంది. ఇప్పటికే, ఆలయ నృత్యం పేరుతో ఎన్నో పురాతన, వెలుగులోకి రాని ఆలయాల వద్ద ఆమె నృత్యంతో వాటికి ప్రాచుర్యం కల్పించింది. మరోసారి కూచిపూడి నృత్య కళాకారిణిగా మనసులో ఉన్న భావాలను కండ్లతో పలికించాలని ఈ నృత్య ప్రదర్శనకి 'అంతర్ ఉన్మేష మనసి'అనే నామకరణం చేశారు.