Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఫిక్కీ, ఎఫ్టీసీసీఐలతో కలిసి ఎక్స్పోర్ట్ ఉత్సవ్‌ను నిర్వహిస్తు న్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరా బాద్ సర్కిల్ వెల్లడించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఎఫ్‌టిసిసిఐలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఎగుమతుల సామర్థ్యం కలిగిన వారికి రుణ మద్దతును సులభతరం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని వెల్లడించింది. ఎక్స్పోర్ట్ ఉత్సవ్‌కు ఎగుమతిదారులు హాజరు కావొచ్చని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ, ఫిక్కీ, ఎఫ్‌టిసిసిఐ సీనియర్ అధికారులతో ఎగుమతిదారులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుంటుందని తెలిపింది. ఎగుమతుల రంగ రుణాలపై వడ్డీ రేట్లు, ప్రోత్సాహకాలను తెలుసుకోవచ్చని వెల్లడించింది.