Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ, బంజారాలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆదివాసీ, బంజారాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈనెల 17న హైదరాబాద్లో ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఆల్ ఇండియా బంజారా అసోసియేషన్ ప్రతినిధులు కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవన ప్రారంభోత్సవానికి లక్షలాది మంది ఆదివాసీలు, బంజారాలు తరలి రావాలని కోరారు. బంజారాల దేవాలయాల్లో దూపధీప నైవేద్యాలకు గత ప్రభుత్వాలు పైసా ఇవ్వలేదనీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి నిధులు అందిస్తున్నదని చెప్పారు. భారతదేశంలో సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు.