Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఏఐవైఎఫ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లలో వైద్య సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ వలీఉల్లా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర లేఖ రాశారు. గురు కులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు వైద్య సేవల కోసం సుదూరం గా ఉన్న పీహెచ్సీ లేదంటే సీహెచ్‌సీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ప్రభుత్వాస్పత్రులు దూరంగా ఉండటం, సకాలంలో వైద్య అధికారులు అందు బాటులో లేక అక్కడ పూర్తి స్థాయి పరీక్షలు చేయడం లేదని తెలిపారు. విద్యార్థుల చదువుతోపాటు- రక్షణ పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిం చాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లలో ప్రతి వారం విద్యార్థుల కు 'హెల్త్ మానిటరింగ్ క్యాంప్'' ద్వారా పూర్తి స్థాయి ఎంబీబీఎస్ డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అన్ని రకాల డయాగస్టిక్ సేవలూ అందుబాటులో ఉంచాలని తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలనీ, స్థానిక ప్రజా ప్రతినిధులు గురుకుల విద్యాసంస్థలు, హాస్టళ్లను సందర్శించాలని కోరారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి సౌకర్యాలను మెరుగుపర్చాలనీ, అవసరమైతే విద్యార్థులతో కలిసి బస చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం సమగ్రమైన పరిష్కార చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రేపటి భావి భారత పౌరుల భవిష్యత్‌ను కాపాడేందుకు, వైద్యారోగ్య శాఖకు సత్వరమే ఆదేశాలను జారీ చేయాలని కోరారు.