Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్ని మోసం చేసేందుకే ఆ పార్టీల డ్రామా
- ఏకాభిప్రాయంతోనే స్రవంతి పేరు ఖరారు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యూపీఏ భాగస్వామ్య పక్షాలను చీల్చి పరోక్షంగా బీజేపీ బలాన్ని పెంచుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ భాగ స్వామ్య పక్షాలను ఇప్పటివరకు కేసీఆర్ కలవలేదని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేసేందుకే డ్రామా ఆడుతున్నాయని ఆగ్రహం వ్యకం చేశారు. చంద్రమండలంలో కూడా కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చు కానీ పక్కనున్న జగన్‌ను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. కేసీఆర్ రద్దయిన వెయ్యి రూపాయల నోటు లాంటివాడని ఎద్దేవా చేశారు. శనివారం హైదరబాద్‌లోని గాంధీభవన్‌లో ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బోసురాజు, అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, మల్లు రవి, ఆర్. దామోదర్ రెడ్డి, చెరుకు సుధాకర్‌తో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. పార్టీ నేతల ఏకాభిప్రాయంతోనే పాల్వాయి స్రవంతి పేరు ఖరారు చేసినట్టు తెలిపారు. అన్ని పార్టీల కంటే ముందు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించామని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించు కోలేని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ఓటమి భయంతోనే ఆపార్టీలు అభ్యర్థులను ప్రకటిం చేందుకు వెనకాడుతున్నాయని ఎద్దేవా చేశారు. మునుగోడులో మండలాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించామన్నారు. నారాయణపూర్ మండల బాధ్యతలు తాను తీసుకున్నట్టు రేవంత్ తెలిపారు. ముఖ్య నాయకులందరినీ నియోజక వర్గంలో ప్రచారానికి ఉపయోగించుకోవాలని నిర్ణయి ంచినట్టు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు పోతామని అన్నారు. సెప్టెంబర్ 18 నుంచి ప్రచారం నిర్వహిస్తామన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, పాల మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రక టించాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌కు బుల్లెట్ రైలు ఇచ్చుకున్న బీజేపీ...హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు అడిగే హక్కులేదన్నారు. నిరుద్యోగుల చావులకు టీఆర్ఎస్సే కారణమనీ, ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడులో టికెట్ ఆశించిన కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేతకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
కవి అందెశ్రీతో రేవంత్ భేటీ
కవి, గాయకుడు అందెశ్రీతో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి భేటీ అయ్యా రు. శనివారం హైదరాబాద్‌లోని అందెశ్రీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు.
శాలువా కప్పి సన్మానించారు. తెలంగాణ ఉద్యమం, సాంస్కృక ఉద్యమం, రాజకీయ పరిస్థితుల తదితరుల సమస్యల పై చర్చించారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మానవతారారు, రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.