Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచరికానికి, దోపిడికి వ్యతిరేకంగానే పోరాటం
- కుల, మత వైషమ్యాలకు ఎర్రజెండా దూరం: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశం పట్ల కమ్యూనిస్టుల ప్రేమ సంస్కారవంతమైందని సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ డి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో 'వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాల' సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సభకు ట్రస్ట్ అధ్యక్షులు సూరవరం సుధాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులుబాసిన వీరులను గౌరవిం చటం కూడా సంస్కారంతో కూడుకున్నదేనని చెప్పారు. అది రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటం మాత్రమే కాదన్నారు. నాటి పాలకుల దోపిడి, పీడన, వెట్టి చాకిరి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలే బందూకులు పట్టిన గొప్ప పోరాటమని వివరిం చారు. ఆ మహాత్తర పోరాటం ఫలితంగానే ప్రాణ వాయువులు పీలుస్తున్నామన్నారు. అయితే..ఆ పోరాట చరిత్రను కానరాకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క వారి త్యాగాల ను, చరిత్రను ఓట్లు సంపాదించి పెట్టే వ్యాపారంగా మార్చు తున్నారని విమర్శించారు. భారతదేశం సంక్షేమ రాజ్యమనీ, 'సంపద పంపిణీ' రాజ్యాంగ మూల సిద్ధాంతమని చెప్పారు. ప్రజలు సృష్టించిన సంపద ''పున్ణ పంపిణీ'' ద్వారా కింది నుంచి పైకి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు ఉచితాలు, సంక్షేమాలని కొందరు చర్చ చేస్తున్నా రనీ, రాజ్యాంగం ప్రకారమైతే.. ఇచ్చే వారు, తీసుకునేవారు ఉండబోరని తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడు తూ సంఫ్‌ుపరివార్ శక్తులు జనాన్ని సమీకరించి, హోం మంత్రి అమిత్‌షా వచ్చి అబద్దాలు మాట్లాడినంత మాత్రాన చరిత్ర మారబోదని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు కులాలను, మతాలను ఆపాదించొద్దని సూచిం చారు. అమరులను ఎర్ర జెండా నుంచి వేరు చేయొద్దన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ అద్దెకు తీసుకున్నాయని విమర్శించారు. పార్ల మెంట్లో రావి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాలను ఎందుకు పెట్టటం లేదని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అమరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాయుధ పోరాట చర్రితను పాఠ్యాంశం లో చేర్చాలన్నారు. విమోచన దినం చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడుతూ ప్రజాస్ఫూర్తితో జరిగిన నాటి పోరాట పరంపర తెలంగాణ లో వివిధ రూపాల్లో సాగుతుందని వివరించారు. ప్రజా స్వామిక సంప్రదాయాలను ముందుకు తీసుకుపోవాల న్నారు. రావి నారాయణ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ అమర వీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదించింది. అజీజ్‌పాష, పల్లా వెంకటరెడ్డి, ఎన్.బాలమల్లేష్, బాలనర్సింహ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యలు బొమ్మగాని ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి నరసింహ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ వందన సమర్పణ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన కూనంనేని..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు బాధ్యతలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్‌లో చాడ వెంకటరెడ్డి కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, బాలమల్లేశ్, పల్లా నర్సింహారెడ్డి పాల్గొని అభినందనలు తెలియజేశారు.
కాషాయ శక్తులతోనే ప్రమాదం..తమ్మినేని
కాషాయ శక్తులు అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రమాదఘంటికలు మోగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను, స్వేచ్ఛ, సమానత్వానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ పాగా వేయటం కోసం పడరాని పాట్లు పడుతున్నదని చెప్పారు. భూమిలేని పేదల కు భూములు పంచాలన్న నినాదం కమ్యూనిస్టుల నుంచే వచ్చిందని తెలిపారు. నాడు సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూ సమస్యనే కేంద్రంగా జరిగిందన్నారు.అలాంటి గొప్ప పోరాటాన్ని బీజేపీ దాని అనుయాయులు కుల, మతాల పోరాటంగా వక్రీకరించటం సిగ్గుచేటని విమర్శించారు.