Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13,29,951 మందికి కేసీఆర్ కిట్
- ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ప్రసవాల సంఖ్య
- ఆదివాసీ, గిరిజన తెగలపై ప్రత్యేక కృషి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. తద్వారా ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని సర్కారు భావిస్తున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నది. మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అనవసర సిజేరియన్ ప్రసవాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచటమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నది. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు సంకల్పంతో ముందుకెళ్తున్నది.కేసీఆర్ కిట్ పథకంతో ఆరోగ్య సూచికల్లో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇద్దరు పిల్లల వరకు కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వాస్పత్రిలో పుట్టిన మగ శిశువుకు రూ.12,000, ఆడశిశువుకు రూ 13,000 లను ఆర్ధిక సహాయంగా నాలుగు విడతల్లో ప్రభుత్వం అందిస్తున్నది. గర్భం దాల్చినప్పటినుంచి ప్రసవానంతనరం కూడా తల్లీ బిడ్డకు అవసరమయిన అన్ని రకాల వైద్య పరీక్షలు, ఇమ్మ్యూనైజెషన్ వాక్సినేషన్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. కేసీఆర్ కిట్ పథకాన్ని 2017 జూన్ 2న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. 2018 ఆగస్టు 2 నుంచి ప్రత్యేక ఆదివాసీ గిరిజన తెగల సంరక్షణ, మనుగడకు కేసీఆర్ కిట్ నిబంధనలకు సర్కారు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. సడలించిన నిబంధనల ప్రకారం పథకం ప్రయోజనాలను రెండో సంతానానికి మించిన చెంచు, కొలం, కొండరెడ్లు, ప్రత్యేకించి ఆదివాసీ గిరిజన సమూహాలకు వర్తింపచేస్తున్నారు. ఈ పథకం కింద రిజిష్టరైన గర్భిణీకి అవసరమయిన టీకాలను, విటమిన్లను ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉచితంగా అందిస్తుంది. ఈ పథకం కింద 2017 నుంచి ఇప్పటి వరకు 13,29,951 మంది లబ్దిపొందారు. పథకం అమలుకు ఇప్పటి వరకు రూ. 1,176.54కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే రూ.243.68 కోట్లు ఖర్చు చేసి, 11,82,014 కేసీఆర్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి కిట్‌లో శిశువు ఆరోగ్య సంరక్షణకు అవసరమైన 15 రకాల వస్తువులను ప్రభుత్వం అందజేస్తున్నది.