Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫస్ట్ ర్యాంక్ ఆల్‌టైమ్ రికార్డ్
- నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణినారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జేఈఈ అడ్వాన్స్డ్-2022 ఫలితాల్లో 'నారాయణ' ఆలిండియా లీడర్‌గా నిలిచిందని ఆ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలిండియా ఫస్టు ర్యాంకును తమ విద్యార్ధి శిశిర్ సాధించడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఆలిండియా టాప్-15లో 1,2,4,8,10,11,12 ర్యాంకులను కైవసం చేసుకున్నట్టు ప్రకటించారు. ఓపెన్ కేటగిరీలో టాప్-100లోపు 22 ర్యాంకులు నారాయణ విద్యాసంస్థలవేనని తెలిపారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకు లాంటి అరుదైన రికార్డు నారాయణ రెండోసారి సాధించటం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆలిండియా అన్ని కేటగిరీల్లో (అందిన సమాచారం మేరకు) 10 లోపు 19 ర్యాంకులు, 100 లోపు 81 ర్యాంకులను కైవసం చేసుకుని ఐఐటీ ఆశయాలను సాకారం చేయటంలో వేరెవ్వరూ నారాయణకు సాటిలేరని నిరూపించారనీ, ర్యాంకర్లను అభినందిస్తున్నామని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో శిశిర్ (హెచ్.నెం : 1033118) ఒకటో ర్యాంకు, లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి (హెచ్.నెం : 6077384) రెండో ర్యాంకు, సాయిసిద్ధార్థ (హెచ్.నెం : 6092069) నాలుగో ర్యాంకు, ధీరజ్.కె (హెచ్.నెం: 6091299) 8వ ర్యాంకు, జ్ఞానమహేష్ (హెచ్.నెం : 5044295) పదో ర్యాంకు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1,65,000 మంది విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షాఫలితాలలో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించారని తెలిపారు. జేెఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష విధానం ఆన్లైన్లో నిర్వహించినప్పటికీ, వినూత్నంగా రూపొందించిన ప్రణాళిక, స్టడీమెటీరియల్, ఆన్లైన్ మాక్ టెస్టులు, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రాం, తదితరాల వల్లనే నారాయణ విద్యార్థులు ఇంతటి ప్రతిభాపాఠవాలను ప్రదర్శించగలిగారని పేర్కొన్నారు.