Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1,2,3,5,6 ర్యాంకులు కైవసం
- ఓపెన్ కేటగిరీలో టాప్ 100లో 26 ర్యాంకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జేఈఈ అడ్వాన్స్డ్-2022 ఫలితాల్లో శ్రీచైతన్య సంచలన విజయం సాధించిందనీ, 1,2,,3,5,6 ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో టాప్ 100 లోపు 26 ర్యాంకులు కైవసం చేసుకున్నట్టు ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్.రావు, అకాడమిక్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్ డైరెక్టర్ సుష్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీచైతన్య విద్యార్థులైన దయ్యాల జాన్ జోసెఫ్(Appl.No:B51221034987) ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు, మెండ హిమ వంశీ(Appl.No:B51421086635) రెండో ర్యాంకు, పల్లి జలజాక్షి(Appl.No:B52421126298) మూడో ర్యాంకు, కజ్జయం వరుణ్గుప్తా(Appl.No:B 51521099424) ఐదో ర్యాంకు, పి.కార్తీకేయ(Appl.No:B51521011866) ఆరో ర్యాంకు సాధించారని తెలిపారు. తమ విద్యార్థులు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 100 లోపు 24 ర్యాంకులు, టాప్ 1000లోపు 123 ర్యాంకులు పొందారని పేర్కొన్నారు. ఆల్ కేటగిరీల్లో పదిలోపులో 1,2,3,4,5,6,8,9 ర్యాంకులు, టాప్-100లో 89, టాప్ 1000లోపు 214 ర్యాంకులు ఒక్క శ్రీచైతన్యవేనని తెలిపారు. దేశంలోనే నిష్ణాతులైన అధ్యాపకులతో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారానే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. అనితర సాధ్యమైన ప్రోగ్రామ్లు, మైక్రోషెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్స్, తదితరాలు తమ విద్యార్థుల విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. ఈసారి ఐఐటీలో మొదటి వరుసతోపాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం వాటా శ్రీచైతన్యదేనని తమ విద్యార్థులు నిరూపించారనీ, వారిని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.