Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరామర్శించిన తమ్మినేని
నవతెలంగాణ- సికింద్రాబాద్
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవతెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్ రమణను మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ ఆదివారం పరామర్శించారు. అనంతరం రమణ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకుని, మనందరిలో ఒకరిగా తిరగాలని ఆకాంక్షించారు. వారి వెంట నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ ఆర్. సుధాభాస్కర్, సీజీఎం ప్రభాకర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య తదితరులు ఉన్నారు.