Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మినేని, కూనంనేనికి మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల వినతి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం,కూనంనేని సాంబశివరా వులకు వేర్వేరుగా వారి పార్టీ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. సమాఖ్య కన్వీనర్ కే రాజిరెడ్డి, కో కన్వీనర్లు ఎంవీ చారి, ఇ శంకర్, సలహాదారు బీజేఎం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా టీఎస్ఆర్టీసీలో పేరుకుపోయిన సమస్యల్ని వారు వినతిపత్రాల్లో వెల్లడించారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించాలని కోరారు.2019 సమ్మె తర్వాతి పరిస్థితులను వామపక్షపార్టీల నేతలకు వివరించారు. ఆర్టీసీ కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు, బకాయిలు, ఉద్యోగ భద్రత, సంస్థ అప్పులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, రిటైర్డ్ ఉద్యోగుల ఇబ్బందులు, అక్రమ రవాణా సహా పలు అంశాలను తమ వినతిపత్రాల్లో ప్రస్తావించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ నేతలు చెప్పారు.