Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిలే నిరాహారదీక్షలకు పోలీసుల అనుమతి నిరాకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలనీ, జిఓ 317 అమలు కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, 13 జిల్లాల స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలనీ, విద్యావాలంటీర్లు, పారిశుధ్య కార్మికులను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) తలపెట్టిన రిలేనిరాహార దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిని యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆ సమస్యల పరిష్కారం కోసం 13న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఆదివారం హైదరాబాద్లోని డీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అత్యవసర సమావేశం సయ్యద్ షౌకత్ అలీ అధ్యక్షతన జరిగింది. అందులో స్టీరింగ్ కమిటీ సభ్యులు కె.జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎం. రఘుశంకర్ రెడ్డి, టి.లింగారెడ్డి, డి.సైదులు, జాదవ్ వెంకట్రావు, బి.కొండయ్య, మసూద్ అహ్మద్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ..సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తమ సమస్యలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లటానికి పోలీసులు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వని పరిస్థితుల్లోనే చలో అసెంబ్లీకి పిలుపునివ్వాల్సి వచ్చిందని తెలిపారు. ఈ పిలుపులో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.