Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎనిమిదేండ్ల బీజేపీి పాలన దేశ సమైక్యతకు, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నదనీ, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీసిందని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.దేశ రాజకీయాలను మోడి, అమిత్ షా ద్వయం భ్రష్టు పట్టించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.దేశ చరిత్రలోనే విష సంస్కృతిని ప్రవేశ పెట్టిన ఘనత వారికే చెల్లిందని విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో జీడీపీ ఘోరంగా దెబ్బతిన్నదని తెలిపారు. సహజ వనరుల వినియోగంలో కేంద్రప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు విద్య,వైద్య రంగాలను గాలికి వదిలేసిందని విమర్శించారు. రాజ్యాంగబద్ద సంస్థలను విపక్షాలపై దాడులకు వినియోగంచటంలో రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో మత కలహాలకు, కర్ఫ్యూ లకు తావు లేదని తెలిపారు. క్రిస్టమస్, రంజాన్, బతుకమ్మ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయేనని పేర్కొన్నారు.