Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
కామారెడ్డి జిల్లాలో మరో వీఆర్ఏ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని లింగాపూర్‌కు చెందిన రాగుల రవి(35) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పే స్కేల్ అమలు చేసి ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవదిక సమ్మెలో రవి చురుగ్గా పాల్గొన్నారని తోటి వీఆర్ఏలు వాపోయారు. ఇంకెంత మంది వీఆర్ఏల చావును రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందని ప్రశ్నించారు. ఇటీవల జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే మరో వీఆర్ఏ ఆత్మహత్యకు పాల్పడటం బాధకరమన్నారు. వీఆర్ఏలెవరూ మనోధైర్యం కోల్పోవద్దని, పోరాటాలతో హక్కులు సాధించుకుందామని, అఘాయిత్యాలకు పాల్పడొద్దని వీఆర్ఏల జిల్లా జేఏసీ ప్రతినిధులు కోరుతున్నారు. కాగా కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.