Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 23 వేల మంది వీఆర్ఏలకు పేస్కేలు వర్తింపజేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. అన్ని శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగానే పేస్కేల్ వర్తింపచేస్తామని, అలాగే వయస్సుపైబడిన వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.