Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర డీజీపీ కార్యాలయం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గణేశ్ నిమర్జనోత్సవం సందర్భంగా మోజాంజాహి మార్కెట్లో అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ పట్ల జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర డీజీపీ భాస్కర జ్యోతి మహంత్ వాకబు మాత్రమే చేశారని తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. అసోం సీఎం పట్ల టీఆర్ఎస్ నాయకుడు నందు బిలాల్ వేదిక పైకి వచ్చి మైకు లాక్కున్న సంఘటన కొంత హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన గురించి అసోం డీజీపీ మహంత్ రాష్ట్ర డీజీపీతో మాట్లాడి ఆ ఘటనకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు సోషల్ మీడియాతో పాటు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయనీ, అది నిజం కాదని అందులో డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. నిజానికి జరిగిన ఘటన గురించి డీజీపీని అసోం డీజీపీ వివరాలు మాత్రం అడిగి తెలుసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.