Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు రోజుల సెలవుల తర్వాత...
- ఉభయ సభలు ఉదయం 10 గంటలకే...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు పున:ప్రారంభం కానున్నాయి. ఈనెల 6 నుంచి ప్రారంభమైన సమావేశాలు అదే రోజు వాయిదా పడ్డాయి. ఐదు రోజుల తర్వాత తిరిగి కొనసాగనున్నాయి. సోమ, మంగళవారాలు జరగనున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సదరన్ విద్యుత్ పంపిణీ కంపెనీ, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ సంస్థలకు సంబం ధించిన వార్షిక నివేదికను ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్షణకు సంబంధించిన ఆడిట్ నివేదికను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీమ్పాక భుపతిరావు మరణం పట్ల సభ సంతాపాన్ని తెలుపనుంది. ఏడు బిల్లులకు సవరణలను ప్రతిపాదించనుంది. కేంద్ర విద్యుత్ బిల్లుపై స్వల్పకాలిక చర్చను చేపట్టనుంది.