Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారలాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, కేంద్ర మాజీ మంత్రి కష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్'గా సినీ ప్రేక్షకుల హదయాల్లో అభిమానం సంపాదించుకున్న కష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కష్ణంరాజు మరణం విచారకరమని అన్నారు. తనకు అత్యంత ఆప్త మిత్రుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు ఆదేశించారు.
పలువురి సంతాపం
సినీ హీరో కృష్ణంరాజు మరణం పట్ల టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,మంత్రులు కే తారకరామారావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్,తదితరులు సంతాపం తెలిపారు.