Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉక్రెయిన్లో వైద్య విద్యనభ్యసిస్తున్న మన దేశ విద్యార్థులకు ఇక్కడ సీట్ల సర్దుబాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావేద్ ఒక ప్రకటన విడుదల చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన సుమారు 20వేల మందికి పైగా వైద్య విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. ఏ దేశంలోనైనా చదువుకోవడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అక్కడ సమస్యలొస్తే మాత్రం పట్టించుకోకపోవడం సరిగాదని విమర్శించారు. ఆన్లైన్ క్లాసులతో వైద్యవిద్యార్థులకు ప్రాక్టీస్ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్యవిద్య విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు.