Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆదివారం 700కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వర్షం కురిసింది. నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం(ఆదివారం రాత్రి పదున్నరవరకు) నమోదైంది. అదే జిల్లా మామడ మండలం పొన్కల్లో 11.83 సెంటీమీటర్లు, లక్ష్మణ్చాంద మండలం వడ్డ్యాల్లో 11.65 అతి భారీ వర్షం పడింది. 46 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.