Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులు
- పలువురు టీచర్ల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీచర్లు తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికత మా జన్మహక్కు, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీచర్లు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. జీవో 317ని రివ్యూ చేయాలని, సీనియారిటీ ప్రకారం కాకుండా స్థానికత ప్రకారం పోస్టింగ్‌లు ఇవ్వాలని కొద్ది నెలలుగా విన్నవించుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దాంతో అసెంబ్లీ వేదికగా సోమవారం ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు, అసెంబ్లీ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు టీచర్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఉపాధ్యాయులు అసెంబ్లీ ముందు బైటాయించడంతో తోపులాట జరిగింది.
మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్‌తోపాటు తదితర జిల్లాల నుంచి టీచర్లు హైదరాబాద్‌కు తరలివచ్చారు. వ్యూహాత్మకంగా మధ్యాహ్నం 1:45గంటల వరకు ఒక్కొక్కరుగా అసెంబ్లీ పరిసరాల్లోకి చేరుకున్నారు. పోలీసుల కండ్లుగప్పి దాదాపు 30 నుంచి 40 మంది వరకు మహిళా టీచర్లతోపాటు ఉపాధ్యాయులు వివిధ ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల వారే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల్లో కొందరు సీనియర్లు విధులకు హాజరుకావడం లేదని, పిల్లలకు పాఠాలు చెప్పడం లేదని చెప్పారు. సీనియర్లు స్థానికంగా ఉండేందుకే రాయకీయం చేస్తున్నారన్నారు. కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే, మరికొందరు చీటీలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారని అలాంటి వారిని బదిలీ చేయకుండా జూనియర్లను దాదాపు 400 కిలోమీటర్ల దూరప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో కుటుంబాలు విడిపోయే పరిస్థితి ఏర్పడిందని, తమ పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని అన్నారు. దాదాపు 25వేల మంది టీచర్లు అన్యాయానికి గురవుతున్నారని, స్థానికత కోల్పోయిన వారిని తిరిగి సొంత జిల్లాల్లోనే నియమించాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్‌తో నిజ నిర్ధారణ కమిటీ వేయా లని డిమాండ్ చేశారు. 317 జీవోతో సమ స్యలు ఏర్ప డుతు న్నాయని, సీఎం కు మా గోడు చెప్పుకు నేందుకు వస్తే పోలీ సులు అక్రమంగా అరె స్టులు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మాతో పాటు వివిధ జిల్లా లు, ప్రాంతాల నుంచి వస్తున్న వారిని సైతం అరెస్టు చేశారని తెలిపారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ హాస్టల్స్‌లో నాణ్యమైన భోజనం పెట్టాలి
సంక్షేమ హాస్టల్స్‌ను ప్రభుత్వం పట్టించు కోవడం లేదని తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టల్స్‌లో ఎలుకలు, పాము కాటుతో పిల్లలు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సరైన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజం అందించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చెల్లించాలని కోరారు. జేఎల్, డీఎల్, టీచర్ల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు.