Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినాయకుల దగ్గర రాజకీయాలా?
- అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
'బండి సంజయ్‌ది చెప్పులు మోసే యాత్ర. కేంద్రం నుంచి ఏం తెచ్చారో... ఏం చేస్తారో పాదయాత్రలో చెప్పరు. వినాయకుల దగ్గర రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటు. దేశ ప్రజలు బీజేపీ ముక్తుభారత్ కోరుకుంటున్నారు' అని ఆర్మూన్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. 30 ఏండ్లల్లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి వినాయక నిమజ్జనాలకు వచ్చారా? మరి ఇప్పుడు ఎందుకు? మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్ప అంటూ విమర్శించారు. యావత్తు ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ముక్తకంఠంతో కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ రేషన్ షాపుల్లో మోడీ చిత్రపటం పెట్టాలంటున్నారని, అయితే, జీఎస్టీ పెట్టిన దగ్గర మోడీ ఫొటో పెట్టాలని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు విశ్వసించరన్నారు.