Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిప్పికొట్టాలని పిలుపు: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్ర బుద్ధితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలు, జమీందారులు, జాగిర్దారుల మీద రైతులు, కూలీలు, పేద ప్రజలు కలిసి కమ్యూనిస్టు జెండా పట్టుకుని చేసిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని తెలిపారు. ఈ పోరాటంలో 4వేల మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. జమీందారులు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాముల నుంచి లాక్కొన్న పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత ఈ పోరాటానికి ఉన్నదన్నారు. దాని ఫలితంగా నైజాం ప్రభువు కమ్యూనిస్టులకు భయపడి భారత ప్రభుత్వంలో తెలంగాణణు విలీనం చేసి మూడేండ్ల పాటు ప్రభుత్వ గవర్నర్‌గా పనిచేశాడని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్, మోతీరాంనాయక్, అరుణ్, నరసింహులు, రాజనర్సు, సతీష్, అల్తాఫ్, మోహన్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.