Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి ప్రత్నామ్నాయం రావాలి...అది కేసీఆర్ కావాలి :మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ పాలనలో దేశం విద్వేషపూరితంగా, వినాశనం దిశగా పయనిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి ప్రత్నామ్నాయం రావాలనీ, అది సీఎం కేసీఆర్ కావాలని ఆకాంక్షించారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అల్పులు, సంకుచిత ధోరణి ఉన్న నేతలు ఈ దేశాన్ని పరిపాలిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సజావుగా వినియోగిస్తూ...మానవ కళ్యాణానికి తోడ్పడాలి కానీ మతాల మధ్య ఘర్షణకు సహకరిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. 90వ దశకంలో తెలుగునేల నుంచి జాతీయస్థాయి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది తెలుగు చైతన్యమేననీ, తమకు ఎదురులేదన్న కాంగ్రెస్‌ను అతలాకుతలం చేసి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు ఏర్పడి ఈ దేశ ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాయన్నారు. ప్రాంతీయ పార్టీల కలయికే ఈ దేశానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను అందించగలవని చెప్పారు.