Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ : టీఎస్పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 833 ఇంజినీరింగ్‌కు విభాగానికి సంబంధించిన పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 434 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్‌తోపాటు 399 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ (జేటీవో) పోస్టులున్నాయని వివరించారు. ఈనెల 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు వచ్చేనెల 21వ తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. ఈనెల 23 నుంచి విద్యార్హతలు, ఇతర వివరాలు, పూర్తిస్థాయి నోటిఫికేషన్ కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఇటీవల మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేసన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.