Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తంగా ఉండాలి
- కలెక్టర్లకు మంత్రులు ఎర్రబెల్లి, వేముల ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు,ఎగువ నుండి గోదావరి లోకి వస్తున్న అధిక వరద నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఎగువ నుండి వస్తున్న వరదపై జిల్లాల కలెక్టర్లను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద ఉదృతి పై అప్రమత్తంగా ఉండాలని, పరివాహక ప్రాంతం ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరా కు ఆటంకాలు రాకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు.
వరద నీటి కోతకు రోడ్లు తెగుతున్నాయనీ,దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. వీటిని వీలైనంత మేరకు తక్షణం పునరుద్దరించాలని సుచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని వారు ఆదేశిచారు.