Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలుగుబెల్లి వాయిదా తీర్మానం తిరస్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేస్కేళ్లు, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాల కోసం పోరాడుతున్న వీఆర్ఏల సమస్యలపై చర్చించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం శాసనమండలిలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. గత 50 రోజుల నుంచి వీఆర్ఏలు సమ్మెలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. అనంతరం యూనివర్సిటీ సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్నికూడా చైర్మెన్ తిరస్కరించారు.