Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభలో ఏడు బిల్లుల ప్రతిపాదన
- భట్టి వాయిదా తీర్మానం తిరస్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు(సీపీఐ) మృతికి సోమవారం శాసనసభ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించారు. ఆయన మరణానికి సభ్యులు రెండు నిమిషాల పాటు సంతాపం ప్రకటించారు.
మున్సిపల్ చట్టసవరణ బిల్లు-2022, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత లీజుల సమాప్తం, క్రమబద్దీకరణ చట్టం-1992కి సవరణ బిల్లు-2022ను మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రవేశపెట్టారు. తెలంగాణ మోటారు వాహనాలపై పన్ను విధింపు చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, అటవీ విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లు-2022ను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లు-2022ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, తెలంగాణ వస్తువుల, సేవలపై పన్ను చట్టం-2017కి సవరణ బిల్లు-2022ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వోద్యోగుల వయో పరిమితి సవరణ బిల్లు-2022ని మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 21వ వార్షిక నివేదికను మంత్రి జగదీష్ రెడ్డి సభ ముందుంచారు. గోదావరి వరదలు, బాధితులు, నష్టపరిహారం, లక్ష్మీబ్యారేజీ పంపు ముంపుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరస్కరించారు. అనంతరం' కేంద్ర విద్యుత్ బిల్లు-పర్యవసనాలు' అంశంపై లఘుచర్చను ప్రారంభించారు.