Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
గిరిజన,ప్రజా సంఘాలతో పాటు వామపక్షాల ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం నిర్వహించిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం పోడు సమస్యపై జిల్లా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 140 ను విడుదల చేసిందని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మానాయక్ ,ఆర్ శ్రీరామ్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగుదారుల నుంచి వారు స్వీకరించిన 3.45 లక్షల దరఖాస్తులను తక్షణం పరిశీలించి, హక్కు పత్రాలు ఇవ్వాలంటూ వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని తెలిపారు. హక్కు పత్రాలు ఇవ్వటంలో ఆలస్యం వల్ల పోడు సాగుదారులపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని పేర్కొన్నారు. వారిపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. దీంతో గిరిజనులు భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పోడు రైతులు వేసిన పంటలను జేసీబీలతో నాశనం చేయటం వల్ల ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. అందువల్ల జీఓ 140ను అమలు చేయడం ద్వారా ఇలాంటి అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.