Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న రాజ్యసభ సభ్యులు డాక్టర్ వి.శివదాసన్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా కేంద్ర వేదికగా 14వ తేదీ నుంచి అఖిల భారత విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర నాలుగో మహాసభ జరగనుంది. 700 మంది సంఘం ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. ఈ మహాసభకు ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ వి.శివదాసన్ రానున్నారు. బుధవారం ప్రారంభమయ్యే మహాసభ సందర్భంగా వేలాది మంది విద్యార్థులతో తెలంగాణచౌక్ నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరగబోయే బహిరంగ సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇప్పటికే నగరమంతా సభా ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీలు ప్రదర్శించారు. సంఘం తోరాణాలతో చౌరస్తాలు అలంకరించారు.
మహాసభను విజయవంతం చేయండి : రజనీకాంత్- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
కరీంనగర్ వేదికగా జరగనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాలుగో సభకు విద్యార్థి లోకం పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్త య్యాయి. నగరమంతా పోస్టర్లు, వాల్రైటింగ్ వంటి ప్రదర్శనలూ పూర్తి చేశాం.