Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి సాంస్కతిక సంస్థ 37 ఏండ్లుగా నిరంతర కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంస్కృతీ, సాంస్కృతిక సహస్ర సంబరాలు నిర్వహించడాన్ని ఆయన కొనియాడారు. ఈ సంస్థ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరడాన్ని ప్రసంసించారు. సోమవారంనాడాయన సహస్ర సంబురాల గోడపత్రికను తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈనెల 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రవీంద్ర భారతిలో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. వరంగల్ జిల్లా చౌటపల్లిలో 1985లో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సంస్థను ప్రారంభించారని వివరించారు. 2019లో తెలంగాణ రాష్ట్ర జానపద చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వంగాల శాంతికష్ణ, విశ్వధరణి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మామిడి అనిత రెడ్డి పాల్గొన్నారు.