Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యవేక్షణ పెంచండి
- ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా రైల్వే ట్రాక్‌ల వద్ద భద్రతా చర్యల్ని మరింత పటిష్టంగా అమలు చేయాలనీ, దానికోసం క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇంచార్జి) అరుణ్‌కుమార్ జైన్ అధికారులను అదేశించారు. సోమవారంనాడాయన సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల ఉన్నతాధికారులతోపాటు విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్‌కు చెందిన డివిజినల్ మేనేజర్లు వెబ్ కాన్ఫÛరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రమాదకర సెక్షన్లలో ట్రాకులు, వంతెనల వద్ద పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. రైళ్ల రాకపోకలపై సమయపాలన పాటించాలని ఆదేశించారు. గంటకు 130 కి.మీల గరిష్ట వేగంతో నడుస్తున్న రైళ్లకు సంబంధించి అందిన గణాంకాల వివరాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎక్సెప్రెస్ రైళ్ల ప్రయాణ సమయం మెరుగవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సరుకు రవాణా రైళ్లను తక్కువ సమయంలో అధిక లోడిరగ్, అన్లోడింగ్ నిర్వహణను సమీక్షించారు.