Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు సాగుకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించేందుకు జీఒ నెం 140ను ప్రభుత్వం విడుదల చేసింది. శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను అధ్యయనం చేయాలని తెలిపింది. అందుకు ప్రభుత్వం జిల్లా స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మెన్‌గా, కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు. సభ్యులుగా పోలీసు కమిషనర్, ఎస్పీ,ఐటీడీఏ పీఓ, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్, లోకల్‌బాడీ అడిషనల్ కలెక్టర్, డీఆర్డీఓ, డీఎఫ్ఓ,డీటీడీఓ ఉంటారు. ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, కమిటీ ఆహ్వానించిన ఇతర సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఇక మీదట అడవులు అన్యాక్రాంతం కాకుండా జిల్లా, మండల, గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి చర్యలు చేపట్టాల్నో ఈ కమిటీ ఆధ్యయనం చేయాల్సి ఉంటుంది. పోడు సాగుపై వచ్చిన దరఖాస్తులను, పోడు కింద ఉన్న అటవీ భూముల వివరాలను తెలియజేయాలి. జిల్లా స్థాయిలో పోడు సమస్య పరిష్కారానికి అవసరమైన సిబ్బందికి శిక్షణ, ఇతర సహకారానికి సంబంధించిన అంచనా నివేదికలు కమిటి సిద్దం చేయాల్సి ఉంటుంది.