Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి జన సమితి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం యువజన , విద్యార్థి జన సమితిల ఆధ్వర్యంలో ''ఛలో అసెంబ్లీ'' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురని పోలీసులు అరెస్టు చేశారు. యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీంపాష, విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాబూ మహాజన్, విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ.. ''తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని గుర్తుచేశారు. ఇదే నిజమైతే పెండిగ్లో ఉన్న రూ. 3500 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ నిధులను ఏందుకు విడుదల చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థి యువజన ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.