Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ చైర్మెన్ ఓబన్న
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అరెస్టులతో వడ్డెరల ఉద్యమాన్ని ఆపలేరని వడ్డెర జేఏసీ చైర్మెన్ ఓబన్న, నాయకులు వడ్డే సంతోష్‌కుమార్ అన్నారు. వడ్డెర కులాన్ని 60 ఏండ్లుగా చిన్నచూపు చూస్తున్నారనీ, గతంలోని ఎమ్‌బీసీ రిజర్వేషన్ నుంచి తీసేసి, కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్ తగ్గిస్తున్నారనీ చెప్పారు. డిమాండ్ల సాధన కోసం సోమవారం చలో అసెంబ్లీకి తమ జేఏసీ పిలుపునిస్తే, జిల్లాల్లో కార్యకర్తల్ని ముందస్తుగా అరెస్టులు చేశారనీ, హైదరాబాద్ అసెంబ్లీ 1వ నెంబర్ గేట్ వద్ద తమను అరెస్టులు చేసి, రాంగోపాల్‌పేట్, నాంపల్లి, తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారని తెలిపారు. ఇలాంటి నిర్బంధాలతో వడ్డెర ఉద్యమాన్ని ఆపలేరనీ, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.