Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్ట్ మాస్టర్ జనరల్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్‌ను ముద్రించి, విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్ పోస్టల్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్‌కు లేఖ రాశారు. బహుజన వీరుడు పాపన్న గౌడ్ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిసేలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల వారికి రాజ్యాధికారం అప్పగించిన చరిత్ర సర్ధార్ దని తెలిపారు.