Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితుల చెక్కుల పంపిణీలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'రాజీవ్‌గాంధీ ప్రమాద బీమా' పార్టీ క్యాడర్‌కు ఎంతో భరోసా ఇస్తుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌తో కలిసి ఆయన బాధితులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ప్రమాద బీమా కోసం రాష్ట్రంలో 90 రోజుల్లో 45లక్షల సభ్యత్వాలను నమోదు చేయించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. 45 లక్షల మంది సభ్యులకు రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పించామని చెప్పారు. ఇప్పటివరకు 427 మంది సభ్యులు చనిపోయారనీ, వారందరికీ ప్రమాద బీమా అందిస్తున్నామని చెప్పారు. 129 మంది ప్రమాద బీమాకు సంబంధించి ధ్రువపత్రాలు సమర్పించారనీ, ఇంకా సమర్పించనివారు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. తొమ్మిది మందికి చెక్కులను పంపిణీ చేసిన ఆయన...మిగతావి బాధితుల ఇంటికే పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావిద్, దామోదర్ రాజానర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, పవన్ మల్లాది తదితరులు ఉన్నారు.