Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్‌లో 200 పడకలతో ఏర్పాటు చేయతలపెట్టిన మాతా, శిశు సంరక్షణ కేంద్రం పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి మంత్రి ఆన్ లైన్లో నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో కొత్త నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో అక్కడ బెడ్ల సంఖ్య 450 నుంచి 750కి పెరుగుతాయని చెప్పారు. మెడికల్ సూపరింటెండెంట్ ప్రతి రోజూ ఎమర్జెన్సీ వార్డు సందర్శించి, బెడ్ల నిర్వహణ సరిగ్గా జరిగేలా చూడాలని ఆదేశించారు. టెలి డయాలసిస్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనీ, క్యాన్సర్ చికిత్సలో బోన్ మారో మార్పిడి శస్త్రచికిత్సలను పెంచాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలనూ సైతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ నెలలో ఆరు శిబిరాల్లో 602 మందికి మొబైల్ స్క్రీనింగ్ నిర్వహించి 14 మందిలో ప్రాథమిక దశలో క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. అన్ని జిల్లాల్లో మొబైల్ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
మా సమస్యలు పరిష్కరించండి : మంత్రి హరీశ్‌కు జూనియర్ డాక్టర్ల లేఖ
ఉపకారవేతనాలు క్రమం తప్పకుండా వచ్చేలా చూడాలనీ, అందులో నుంచి పన్ను మినహాయించకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావుకు టీజూడా అధ్యక్షులు డాక్టర్ కార్తీక్ నాగుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వన్య జాస్మీన్, ఉపాధ్యక్షులు డాక్టర్ డి.శ్రీనాథ్ లేఖ రాశారు. నిమ్స్ రెసిడెంట్ డాక్టర్లతో సమానంగా స్టైఫండ్ పెంచాలని కోరారు. సరిపోయేలా హాస్టల్ వసతిని కల్పించాలని పేర్కొన్నారు. రోగులకు మెరుగైన సేవలందేలా నేరుగా నియామకాలకు క్యాలెండర్ ఇయర్ ను ప్రకటించాలనీ, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచాలనీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.