Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గించాలంటూ సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలోని బృందం భట్టికి వారు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో భట్టికి శాలువా కప్పి, గజమాలతో సత్కరించారు.
భారత్ జోడో యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన భట్టి
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు బడుగు, బలహీనవర్గాల అండ అనే పోస్టర్‌ను సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, పీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశానికి రాహుల్ నాయకత్వం అవసరమని చెప్పారు. దేశంలో మతోన్మాద విచ్చిన్నకర శక్తులు చెలరేగుతున్న క్రమంలో జాతిని ఏకం చేసేందుకు భారత్‌జోడో యాత్ర కొనసాగుతుందనీ, దానికి బడుగు, బలహీనవర్గాలు అండగా నిలబడటం సంతోషకరమని చెప్పారు.