Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇక మీదట నిరంతరాయంగా ఫార్మసీ విద్య కార్యక్రమాలు నిర్వహిస్తా మని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరా బాద్ వెంగళ్రావు నగర్లో ఫార్మసీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉత్తమ ఫార్మసీ ఉపాధ్యాయులను సన్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 25 మందికి ఉత్తమ ఫార్మసీ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ఈ సంద ర్భంగా సంజయ్ రెడ్డి మాట్లాడుతూ ఫార్మాసిస్టులకు ఔషధాలపై అవగాహ న కల్పించడం, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం తమ లక్ష్యాలని వివరించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ నాణ్యమైన ఔష ధాలను ప్రజలకు అందిస్తూ వాటి దుష్ప్రభావాలను తగ్గించే వారే నిజ మైన ఫార్మాసిస్టులనీ, వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ రిజిస్ట్రార్ బి. యోగానందం, ఉపాధ్యక్షులు ఆర్. శ్రీనివాస్, సభ్యులు చంద్రశేఖర్ ఆజాద్, వినోద్ పాల్గొన్నారు.