Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీలో బీకాం (బిజినెస్ అనలిటిక్స్) కోర్సు మూడు, ఐదో సెమిస్టర్ల కు సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం హైదరాబాద్లో ఆవిష్కరి ంచారు. డేటా అనలిటిక్స్ మోడల్లింగ్, అడ్వాన్స్డ్ డేటా విజువలైజేషన్ పాఠ్య పుస్తకాలను గజేంద్రబాబు, శాంతి వేదుల, అపర్ణ బులుసు సంయుక్తంగా రాశారు. గ్రంధకర్తలను వారు అభినం దించారు. ఆఖరి ఏడాది విద్యా ర్థులకూ ఉపయోగకరంగా ఉండే పుస్తకాలను రాసి మేలు చేయాలని కోరారు. ఈ పుస్తకాలను హిమాలయ పబ్లిషర్స్ ప్రచురించింది.