Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందుల ధరలను తగ్గించాలి.. జీఎస్టీ ఎత్తేయాలి :
- తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీవ్స్ యూనియన్ డిమాండ్
- గోల్కొండ క్రాస్రోడ్లో జీపుజాతా ప్రారంభం
నవతెలంగాణ- హైదరాబాద్
ప్రభుత్వ రంగ ఫార్మా వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధ రించాలని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటీవ్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మందుల ధరలను తగ్గించేం దుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతాను బుధవారం హైదరాబాద్లోని గోల్కొండ క్రాస్ రోడ్డులో ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందుల ధరలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణ కోసం కనీసం జీడీపీలో ఐదు శాతం నిధులను కేటాయించాలని, మందులపై జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేసే నిధుల్లో సింహభాగం మందుల కొనుగోలుకే కేటాయిస్తున్నారని తెలిపారు. దేశంలో 95 శాతం ఔషధాలు ప్రయివేటు రంగం ద్వారా తయారు చేయబడుతున్నాయని తెలిపారు.
సామాన్య ప్రజల ఆరోగ్య సంరక్షణకు అవసరమైన దాదాపు అన్ని ఔషధాలు మధ్యప్రదేశ్లోని స్థానిక ప్రయివేట్ రంగంలోని ఫార్మా కంపెనీల ద్వారా తయారు చేయబడుతున్నాయని చెప్పారు. దేశంలో 18 శాతానికిపైగా కుటుంబాల్లో.. ప్రతి ఇంటా ఆరోగ్యానికి, మందులకు కేటాయించే ఖర్చులు భరించలేని విధంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఆరోగ్యం, వైద్యం సంబంధిత సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడానికి దేశవ్యాప్తంగా అవగాహన కోసం జీపుజాతా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో ఔషధాల ధరలు పెరగడానికి కారణమయ్యే కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాల గురించి అన్ని జిల్లాల్లో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సిహెచ్.భాను కిరణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్.లోకేష్ రెడ్డి, సికింద్రాబాద్ సెక్రటరీ టి.వి.సతీష్ కుమార్, అధ్యక్షులు ఎన్విఎస్ సాయిరామ్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.