Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వి.ఐ.టీ. ఏపీ విశ్వవిద్యాలయంలోనితీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 నుంచి 17 (ఐదు రోజుల పాటు) వరకు హై ఇంపాక్ట్ జర్నల్స్‌లో రీసెర్చ్ ఆర్టికల్స్ రాయడం, ప్రచురించడంపై అంతర్జాతీయ సింపోజియంను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వివ్ సాఫ్ట్ టెక్నాలజీస్ (యూఎస్ఏ) సీఈఓ గుణాలన్ ముఖ్యతిథిగా విచ్చేసి పరిశోధన యొక్క ప్రాముఖ్యత , పరిశ్రమ అవసరాలు, అవకాశాలపై ప్రసంగించారు. నాణ్యమైన పరిశోధన, నూతన వ్యాపారక ఆవిష్కరణల కోసం అధిక ఇంపాక్ట్ క్వాలిటీ రిసెర్చ్‌పై దృష్టి పెట్టాలని కోరారు. వి.ఐ.టీ. ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, డా. ఎస్. వి కోట రెడ్డి విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమ సమన్వయ కర్తగా డా. అరుణ్‌కుమార్ వ్యవహరించారు. వి.ఐ.టీ. ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అసోసియేట్ డీన్ డా. రాఘవేంద్ర , విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. జగదీష్ చంద్ర ముదిగంటి, విద్యార్థులు పాల్గొన్నారు.