Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సంస్థ కొత్త లోగో ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్
దేశంలోని అగ్రశ్రేణి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలలో ఒకటైన సదరన్ ట్రావెల్స్ స్వర్ణోత్సవ సంబురాలు న్యూఢిల్లీలోని లలిత్ హౌటల్లో అంబరాన్నంటేలా అద్భుత రీతిలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ సంస్థ నూతన లోగోను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ట్రావెలింగ్ , టూరిజం రంగాలు చక్కని అభివృద్ధిని సాధించడంలో సదరన్ ట్రావరెల్స్ సంస్థ ముఖ్య పాత్ర పోషిస్తోందని అన్నారు. భారత ప్రభుత్వంచే 8 సార్లు బెస్ట్ డొమెస్టిక్ ఆపరేటర్ అవార్డును సొంతం చేసుకుందని ప్రశంసించారు. సంస్థ చైర్మెన్ ఆలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ సంస్థను 1970 సంవత్సరంలో ప్రారంభించామని, 1995లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ మోహన్ పాల్గొని మాట్లాడారు.