Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవస్థ గౌరవాన్ని పోగొట్టొద్దు
- కేంద్రం ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థకి విఘాతం : శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
బీజేపీలాగే.. రాష్ట్ర గవర్నర్ కూడా విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యమని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆమె రాష్ట్ర గవర్నర్గా ఉండి.. తాను పూర్వ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థకి వుండే గౌరవాన్ని పోగొట్టొద్దని సూచించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసి 74 ఏండ్లు పూర్తి చేసుకొని 75 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నదున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాక్షాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషమన్నారు. ఆనాడు పోరాటంలో అశువులు బాసిన వారికి జోహార్లు అన్నారు. బాధ్యత లేకుండా కొంత మంది.. విలీనం, విమోచనం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియని వారు కూడా ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థకి విఘాతం కలిగిస్తున్న దన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ ఇబ్బందులు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.